గురువారం 01 అక్టోబర్ 2020
National - Aug 04, 2020 , 15:32:54

పాపం.. పిల్లిని ముప్ప‌తిప్ప‌లు పెట్టిన ఎలుక : వీడియో వైర‌ల్‌‌

పాపం.. పిల్లిని ముప్ప‌తిప్ప‌లు పెట్టిన ఎలుక :  వీడియో వైర‌ల్‌‌

చిన్న‌పిల్ల‌ల‌కు టామ్ అండ్ జెర్రీ వీడియోలు అంటే తెగ ఇష్టం. ఎంతో పెద్ద‌గా ఉండే టామ్‌ను ముప్ప‌తిప్ప‌లు పెట్టందే జెర్రీకి నిద్ర‌ప‌ట్ట‌దు. ఆకారంలో పెద్ద‌దైనా జెర్రీ తెలివితేట‌ల‌కు టామ్ బ‌ల‌వ్వాల్సిందే. వీరి కాంబినేష‌న్‌ను ఇష్ట‌ప‌డ‌ని వారే ఉండ‌రు. ఇదంతా రీల్ లైఫ్ అయితే రియ‌ల్ లైఫ్‌లో కూడా ఇలాంటి కాంబినేష‌న్‌ను చూడొచ్చు. అదేనండి పిల్లి, ఎలుక‌.

సాధార‌ణంగా ఎలుక క‌నిపిస్తే చాలు పిల్లికి నోరూరుతుంది. నోటికి క‌రిపిచ్చుకొని దూరంగా వెళ్లి తినేస్తుంది. అందుకే పిల్లి క‌నిపిస్తే ఎలుక ఎక్క‌డున్నా తొర్ర‌లోకి పారిపోతుంది. అలాంటిది ఈ వీడియోలో ఒక పెద్ద పిల్లి‌ని త‌రుముకుంటున్న‌ది. ]చిన్న పిల్లులు నిజ జీవితంలో టామ్ అండ్ జెర్రీ] అనే శీర్షిక‌తో బిగ్ అజ్ అనే యూజ‌ర్ ట్విట‌ర్‌లో షేర్ చేశారు. 19 సెకండ్ల‌పాటు న‌డిచే ఈ వీడియోలో పిల్లి ఒక‌సారి ఎలుక‌ను క‌దిలించిన‌ప్ప‌టి నుంచి పిల్లిని ఎలుక వెంబ‌డిస్తూనే ఉంది. క్లిప్‌కు మ్యూజిక్ కూడా యాడ్ చేయ‌డంతో చాలా ఫ‌న్నీగా ఉంది. 


logo