Hilarious video clip| పిల్లలు అంటేనే అల్లరి.. అల్లరి అంటేనే పిల్లలు. పిల్లలు చేసే అల్లరి కొన్నిసార్లు చికాకు తెప్పిస్తుంది. కానీ ఒక్కోసారి కడుపుబ్బ నవ్విస్తుంది. మనుషుల్లోనే కాదు.. జంతువుల్లోనూ తరచూ ఇలాంటి సందర్భాలు చోటుచేసుకుంటూనే ఉంటాయి. తాజాగా అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
రాయల్ బెంగాల్ జాతికి చెందిన తెల్లపులి.. దాని పిల్ల చేసిన పనితో దెబ్బకు దడుసుకుంది. తల్లి ఎన్‌క్లోజర్ బయట ఏదో తింటూ ఉండగా.. వెనుక నుంచి ఒక్కసారిగా పులిపిల్ల వచ్చింది. నడుస్తూ కాకుండా గది లోపలి నుంచి ఎగిరి తల్లి ముందు దూకింది. దాంతో తనపై ఏదో దాడి చేస్తుందనుకుని తల్లి ఉలిక్కిపడింది.
అయితే, తల్లి భయంతో ఉలిక్కిపడి కింద పడిపోవడం చూసి పిల్లపులి కూడా భయపడింది. రెండడుగులు వెనక్కి వేసింది. తర్వాత తల్లికి కోపం వచ్చిందని గ్రహించి ఏమీ ఎరుగనట్టు మెల్లగా పక్కకు వెళ్లిపోయింది. కేవలం మూడు సెకన్ల నిడివిగల ఈ వీడియో చూస్తే నవ్వకుండా ఉండలేరు. మరెందుకు ఆలస్యం..? మీరు కూడా ఒకసారి ఈ వీడియో చూసి మనసారా నవ్వుకోండి…
Baby tiger sneaks up on its mom. pic.twitter.com/yCyd7HAhmE
— Fascinating (@fasc1nate) December 4, 2022