బుధవారం 25 నవంబర్ 2020
National - Nov 19, 2020 , 12:45:33

'హైవే' కిల్లింగ్ గ్యాంగ్ అరెస్ట్‌

'హైవే' కిల్లింగ్ గ్యాంగ్ అరెస్ట్‌

మ‌థుర‌: ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం మ‌థుర జిల్లాలో జాతీయ ర‌హ‌దారిపై ఒంట‌రిగా ప్ర‌యాణించేవారే ల‌క్ష్యంగా దోపిడీల‌కు, హ‌త్య‌ల‌కు పాల్ప‌డుతున్న ఓ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. మ‌థుర‌లోని మూడు పోలీస్‌స్టేష‌న్‌ల‌కు సంబంధించిన పోలీసులు ఐదు బృందాలుగా ఏర్ప‌డి ఈ ముఠా ఆట‌క‌ట్టించారు. జ‌మునా పార్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధి మావ‌ళి గ్రామంలోని కళ్యాణ్‌పురి మూడు రోడ్ల కూడ‌లి వ‌ద్ద ఈ గ్యాంగ్ ఉన్న‌ట్లు స‌మాచారం అందుకున్న పోలీసులు.. రౌండ‌ప్ చేసి అదుపులోకి తీసుకున్నారు. 

ఈ సంద‌ర్భంగా పోలీసులు, నేర‌స్థుల‌కు మ‌ధ్య స్వ‌ల్ప ఎన్‌కౌంట‌ర్ చోటుచేసుకుంది. ఈ ఎన్‌కౌంట‌ర్‌లో ధ‌ర్మేంద్ర‌, స‌చిన్ అనే ఇద్ద‌రు నేర‌స్థులు గాయ‌ప‌డటంతో ఆస్ప‌త్రిలో చేర్పించారు. శివ‌మ్ అనే మ‌రో నేర‌గాడిని పోలీస్‌స్టేష‌న్‌లో పెట్టారు. మ‌థుర‌లోని జాతీయ ర‌హ‌దారి వెంట‌ వేర్వేరు ప్ర‌దేశాల్లో వేర్వేరు తేదీల్లో మూడు హ‌త్య‌లు జ‌రిగాయి. ఈ నేప‌థ్యంలో స్థానికంగా ఉండే మూడు పోలీస్‌స్టేష‌న్‌ల పోలీసులు జాయింట్ ఆపరేష‌న్ చేప‌ట్టి ఎట్ట‌కేల‌కు నేర‌స్థుల‌ను అరెస్ట్ చేశారు.       

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.