న్యూఢిల్లీ: వ్యాక్సిన్ పాస్‌పోర్ట్ జారీ చేయాలన్న ప్రతిపాదనను భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. శుక్రవారం జరిగిన జీ-7 దేశాల ఆరోగ్య మంత్రుల సదస్సులో భారత్ తరఫున ఆతిధ్య హోదాలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ మాట్లాడుతూ .. వ్యాక్సిన్ పాస్‌పోర్ట్ అంటే అత్యంత వివక్షా పూరితమేనని స్పష్టం చేశారు.
సంపన్న దేశాలతో పోలిస్తే, అభివ్రుద్ధి చెందుతున్న దేశాలు వ్యాక్సిన్ల పంపిణీ, సరఫరా, రవాణా, వ్యాక్సిన్ల సామర్థ్యం అంశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని హర్షవర్ధన్ గుర్తు చేశారు. ఈ పరిస్థితుల్లో వ్యాక్సిన్ పాస్‌పోర్ట్ ప్రతిపాదన తేవడం అంటే వర్ధమాన దేశాల పట్ల వివక్ష ప్రదర్శించడమేనన్నారు.
మనదేశంలోనూ ఇప్పటివరకు మూడు శాతం జనాభాకు మాత్రమే వ్యాక్సినేషన్ పూర్తయింది. వ్యాక్సిన్ల కొరతతోపాటు అభివ్రుద్ధి చెందుతున్న దేశాల్లో వ్యాక్సినేషన్ నెమ్మదిగా సాగుతున్నది. మున్ముందు ముంచుకొచ్చే మహమ్మారులను ఉమ్మడిగా ఎదుర్కోవాలని హర్షవర్ధన్ పిలుపునిచ్చారు.
అయితే, పేద, అభివ్రుద్ధి చెందుతున్న దేశాలకు టీకాల పంపిణీపై ఈ సదస్సు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అన్ని దేశాలకు సమానంగా టీకాల పంపిణీపై కొత్త నిర్ణయాలు తీసుకోలేదు.
కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఒక దేశం నుంచి మరో దేశానికి ప్రయాణించాలంటే వ్యాక్సిన్ పాస్‌పోర్ట్ జారీ చేయాలన్న ప్రతిపాదన వచ్చింది. టీకా వేయించుకున్నట్లు ప్రభుత్వ ధ్రువీకరణ పత్రం సంబంధిత యాప్‌లో ఉంటుంది. దాన్ని బట్టి ఇతర దేశాలకు అనుమతించే విధానమే వ్యాక్సిన్ పాస్‌పోర్ట్.
జూన్ 30 వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్‌ను పొడిగించిన పేటీఎం…
ఎస్బీఐ కస్టమర్లకు గమనిక.. ఆ పత్రాలు సమర్పిస్తేనే సేవలు
రాష్ట్ర ప్రభుత్వానికి 100 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు
తమిళనాడులో మరో వారం లాక్డౌన్ పొడగింపు
చరిత్రలో ఈరోజు : ఐదుగురిలో తొలిసారి ఎయిడ్స్ గుర్తింపు
ట్విటర్‌కు చివరి హెచ్చరిక జారీ చేసిన ప్రభుత్వం
కొవిడ్ కిట్ లో కరోనిల్ : పతంజలి ప్రతిపాదన వ్యతిరేకించిన ఐఎంఏ
ఢిల్లీ అన్‌లాక్.. సరి, భేసి విధానంలో మాల్స్, మార్కెట్లకు అనుమతి
వెంకయ్య ఖాతాకు బ్లూటిక్ రీస్టోర్ చేసిన ట్విటర్
జైసల్మేర్ జిల్లాలో పవర్‌గ్రిడ్ ఆక్సిజన్ ప్లాంటు…
ఆరెస్సెస్ చీఫ్ భగవత్ ట్విట్టర్ బ్లూటిక్ రిమూవ్, అయితే!
ఆన్లైన్ మనీ ట్రాన్స్ఫర్ చార్జీలు.. ఏ బ్యాంకులో ఎంత అంటే …?