బుధవారం 27 మే 2020
National - May 08, 2020 , 07:54:15

ఢిల్లీలో 24 గంట‌ల్లో కొత్త‌గా 448 కోవిడ్‌-19 కేసులు న‌మోదు..

ఢిల్లీలో 24 గంట‌ల్లో కొత్త‌గా 448 కోవిడ్‌-19 కేసులు న‌మోదు..

ఢిల్లీ:  దేశ రాజ‌ధాని ఢిల్లీ న‌గ‌రంలో ఒక్క రోజులోనే 24 గంట‌ల్లో కొత్త‌గా 448 కోవిడ్‌-19 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో మొత్తం క‌రోనా కేసులు 5,980కి చేరుకున్నాయి. న‌గ‌రంలో 66 మంది క‌రోనా బాధితులు మృత్యువాత ప‌డ్డారు. రాష్ట్ర ఆరోగ్య‌శాఖ వివ‌రాల ప్ర‌కారం 3,983 కోవిడ్‌-19 కేసులు యాక్టివ్‌లో ఉండ‌గా, ఇప్ప‌టి వ‌ర‌కు 1,931 మంది బాధితులు క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నారు. ప్ర‌స్తుతం ఢిల్లీలో 87 కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి. ఇందులోకి బాలాజీ అపార్ట్‌మెంట్‌, శాస్త్రీ మార్కెట్‌, కృష్ణ అపార్ట్‌మెంట్‌, అబుల్‌ఫ‌జ‌ల్ ఎంక్లేవ్స్‌ల‌ను కంటైన్మెంట్ జోన్లుగా మారుస్తూ నిర్ణ‌యం తీసుకుంది. 


logo