మంగళవారం 14 జూలై 2020
National - Jun 26, 2020 , 17:57:34

బెంగాల్‌లో హ‌య్య‌ర్ సెకండ‌రీ ప‌రీక్ష‌లు ర‌ద్దు

బెంగాల్‌లో హ‌య్య‌ర్ సెకండ‌రీ ప‌రీక్ష‌లు ర‌ద్దు

కోల్‌క‌తా: క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా వివిధ రాష్ట్రాల్లో ప‌రీక్ష‌ల వాయిదాల ప‌ర్వం కొన‌సాగుతున్న‌ది. కొన్ని రాష్ట్రాల్లో 10వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ర‌ద్ద‌య్యాయి. మ‌రికొన్ని రాష్ట్రాల్లో 10వ త‌ర‌గ‌తితోపాటు ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌ను కూడా ర‌ద్దు చేశారు. ఇంకొన్ని రాష్ట్రాల్లో డిగ్రీ ప‌రీక్ష‌లు సైతం ర‌ద్ద‌య్యాయి. జాతీయ స్థాయిలో బోర్డులైన సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ కూడా 10వ త‌ర‌గ‌తి, ఇంట‌ర్ పెండింగ్‌ ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేసి, రాసిన ప‌రీక్ష‌ల్లో మార్కుల ఆధారంగా జూలై 15న ఫ‌లితాలు వెల్ల‌డించేందుకు సిద్ధ‌మ‌య్యాయి. 

అయితే, తాజాగా ప‌శ్చిమబెంగాల్‌లో కూడా హ‌య్య‌ర్ సెకండ‌రీ ప‌రీక్ష‌లు ర‌ద్ద‌య్యాయి. క‌రోనా మ‌హమ్మారి నేప‌థ్యంలో జూలై 2, 6, 8 తేదీల్లో జ‌రుగాల్సిన ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప‌శ్చిబెంగాల్ విద్యాశాఖ వెల్ల‌డించింది. ఈ మేర‌కు బెంగాల్ విద్యాశాఖ మంత్రి పార్థ చ‌ట‌ర్జీ శుక్ర‌వారం ఒక ప్ర‌క‌ట‌న చేశారు. అయితే ప్ర‌స్తుతానికి ర‌ద్ద‌యిన ప‌రీక్ష‌ల‌ను తిరిగి నిర్వ‌హిస్తామ‌ని, ఎప్పుడు నిర్వ‌హిస్తామ‌నే వివ‌రాల‌ను త‌ర్వాత వెల్ల‌డిస్తామ‌ని పార్థ చ‌ట‌ర్జి పేర్కొన్నారు.    


logo