శుక్రవారం 10 జూలై 2020
National - Jun 03, 2020 , 15:28:38

గుజ‌రాత్ తీరంలో ఎగిసిప‌డుతున్న అల‌లు.. వీడియో

గుజ‌రాత్ తీరంలో ఎగిసిప‌డుతున్న అల‌లు.. వీడియో

అహ్మ‌దాబాద్‌: నిస‌ర్గ తుఫాను ప్ర‌భావంతో ఆరేబియా స‌ముద్రం అల్ల‌క‌ల్లోలంగా మారింది. గుజ‌రాత్‌, మ‌హారాష్ట్ర తీర ప్రాంతాల్లో అల‌లు ఎగిసి ప‌డుతున్నాయి. తుఫాను నేప‌థ్యంలో అధికారులు ఇప్ప‌టికే అన్ని ర‌కాల జాగ్ర‌త్త చ‌ర్య‌లు చేప‌ట్టారు. 16 ఎన్‌డీఆర్ఎఫ్ బృందాల‌ను గుజ‌రాత్ తీర ప్రాంతాల్లో మోహ‌రించారు. తీర ప్రాంత గ్రామాల‌కు చెందిన సుమారు 20,000 మందిని సురక్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించారు. కాకా, గుజ‌రాత్‌లోని ద్వార‌క పుణ్య‌క్షేత్రం వ‌ద్ద అల‌ల ఉధృతి మరింత ఎక్కువ‌గా ఉన్న‌ది. దాదాపు 15 నుంచి 20 అడుగుల ఎత్తులో రాకాసి అల‌లు ఎగిసి ప‌డుతున్నాయి.


logo