సోమవారం 13 జూలై 2020
National - Jun 20, 2020 , 13:12:50

అల్ల‌క‌ల్లోలంగా ముంబై తీరం.. ఎగిసిప‌డుతున్న అల‌లు!.. వీడియో

అల్ల‌క‌ల్లోలంగా ముంబై తీరం.. ఎగిసిప‌డుతున్న అల‌లు!.. వీడియో

ముంబై: నైరుతి రుతుప‌వ‌నాల ప్ర‌భావంతో మ‌హారాష్ట్ర‌లో విస్తారంగా వ‌ర్షాలు కుర‌స్తున్నాయి. గ‌త రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి రాజ‌ధాని ముంబైతోపాటు శాంటక్ర‌జ్‌, మ‌లాద్‌, థానే ప‌ట్ట‌ణాలు జ‌ల‌మ‌య‌మ‌య్యాయి. లోత‌ట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ప‌లుచోట్ల రోడ్ల‌పై నీరు నిలువ‌డంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. వ‌ర్షానికి తోడు ఈదురు గాలులు కూడా వీస్తుండ‌టంతో ప‌లుచోట్ల వృక్షాలు నేల‌కూలాయి. చెట్ల కొమ్మ‌లు విరిగిప‌డ్డాయి. 

మ‌రో ముంబై స‌ముద్ర తీరం అల్ల‌క‌ల్లోలంగా మారింది. భారీ అల‌లు తీరం వైపు వేగంగా దూసుకొస్తున్నాయి. దాదాపు 4.5 నుంచి 5 మీట‌ర్ల ఎత్తున అల‌లు ఎగిసిప‌డుతున్నాయి. రానున్న కొన్ని గంట‌ల్లో స‌ముద్ర తీరం మ‌రింత అల్ల‌క‌ల్లోలంగా మారే అవ‌కాశం ఉంద‌ని ముంబై వాతావ‌ర‌ణ కేంద్రం హెచ్చ‌రించింది. దీంతో పోలీసులు ముంబైలోని ఆరేబియా స‌ముద్ర తీరం వెంబ‌డి భారీబందోబ‌స్తు ఏర్పాటు చేశారు. ప్ర‌జ‌లు ఎవ‌రూ తీరం వైపు వెళ్లొద్ద‌ని హెచ్చ‌రిస్తున్నారు.  logo