గురువారం 21 జనవరి 2021
National - Jan 10, 2021 , 20:08:32

జాతీయ విద్యా విధానం-2020పై రేపు ఉన్నతస్థాయి సమీక్ష

జాతీయ విద్యా విధానం-2020పై రేపు ఉన్నతస్థాయి సమీక్ష

న్యూఢిల్లీ :  జాతీయ విద్యా విధానం-2020 అమలుపై కేంద్ర విద్యాశాఖ మంత్రి  రమేశ్‌ పోక్రియాల్‌ ఉన్నతస్థాయి అధికారులతో  సోమవారం సమీక్ష నిర్వహించనున్నారు. ఎన్‌ఈపీ-2020 అమలు, కరోనా నేపథ్యంలో విద్యాసంస్థల్లో పాటించాల్సి జాగ్రత్తలు తదితర అంశాలపై అధికారులతో ఆయన చర్చించనున్నట్లు సంబంధిత శాఖ అధికారుల ద్వారా తెలిసింది. ‘కరోనా కారణంగా విద్యాసంస్థలు మూతపడిన నేపథ్యంలో ఆశించిన విధంగా నూతన విద్యావిధానం అమలు కాలేదు. 

ప్రస్తుతం పరిస్థితులు సాధారణ పరిస్థితికి చేరడంతో ఉన్నత విద్యాసంస్థలు, పాఠశాలల్లో హైయర్‌ క్లాసులు ప్రారంభమయ్యాయి. అందుకే నూతన విద్యా విధానంపై చర్చించేందుకు, వేగంగా అమలు చేసేందుకు ఇదే సరైన సమయం’ అని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. జాతీయ విద్యావిధానం -1986 స్థానంలో కేంద్రం గతేడాది జులైలో నూతన విద్యావిధానం- 2020ని తీసుకువచ్చింది. దేశంలో పాఠశాల స్థాయి నుంచి ఉన్నతస్థాయి విద్య వరకు ఏకీకృత విధానాలు అమలు చేసేందుకే నూతన విద్యా విధానం తీసుకువచ్చినట్లు పేర్కొంది. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo