బుధవారం 08 ఏప్రిల్ 2020
National - Feb 27, 2020 , 10:00:30

పోలీసుల‌ను త‌ప్పుప‌ట్టిన న్యాయ‌మూర్తి బ‌దిలీ..

పోలీసుల‌ను త‌ప్పుప‌ట్టిన న్యాయ‌మూర్తి బ‌దిలీ..

హైద‌రాబాద్‌:  పోలీసుల వైఫ‌ల్యం వ‌ల్లే ఢిల్లీలో అల్ల‌ర్లు చోటుచేసుకున్నాయ‌ని చెప్పిన ఢిల్లీహైకోర్టు జ‌డ్జి జ‌స్టిస్  ఎస్ ముర‌ళీధ‌ర్‌పై వేటు ప‌డింది.  కేంద్రాన్ని, రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని, ఢిల్లీ పోలీసుల‌ను ప్ర‌శ్నించిన ఆ న్యాయ‌మూర్తిని బ‌దిలీ చేశారు.  ఢిల్లీ హైకోర్టు నుంచి పంజాబ్‌, హ‌ర్యానా హైకోర్టుకు ఆయ‌న్ను బ‌దిలీ చేసిన‌ట్లు స‌మాచారం.  బుధ‌వారం రాత్రి 11 గంట‌ల‌కు ఆ జ‌డ్జిని ట్రాన్స్‌ఫ‌ర్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆ న్యాయ‌మూర్తిని బ‌దిలీ చేయాల‌ని రెండు వారాల క్రిత‌మే సుప్రీంకోర్టు కొలీజియం ప్ర‌తిపాద‌న చేసింది. రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్ 222 క్లాజ్‌(1) ప్ర‌కారం ఆదేశాలు జారీ అయిన‌ట్లు తెలుస్తోంది.  జస్టిస్ ముర‌ళీధ‌ర్‌ను ట్రాన్స్‌ఫ‌ర్ చేయాల‌ని ఢిల్లీహైకోర్టు బార్ అసోసియేష‌న్ డిమాండ్ చేసింది. అయితే తాజా ఢిల్లీలో జ‌రిగిన అల్ల‌ర్ల‌ కేసును విచారించిన జ‌స్టిస్ ముర‌ళీధ‌ర్‌.. పోలీసుల్ని త‌ప్పుప‌ట్ట‌డంతో సీన్ రివ‌ర్స్ అయ్యింది.1984 నాటి ప‌రిస్థితులు పున‌రావృత్తం కావొద్దు అంటూ ఆ న్యాయ‌మూర్తి త‌న తీర్పులో పేర్కొన్న‌డం వివాదాస్ప‌ద‌మైంది. విద్వేష ప్ర‌సంగాలు చేసిన బీజేపీ నేత‌ల వీడియోల‌ను ప‌రిశీలిస్తున్న స‌మ‌యంలో జ‌డ్జి ఆ తీర్పునిచ్చారు. 
logo