బుధవారం 08 జూలై 2020
National - Jun 18, 2020 , 02:00:10

త్రివిధ దళాలు హై అలర్ట్‌

త్రివిధ దళాలు హై అలర్ట్‌

న్యూఢిల్లీ: గల్వాన్‌ ఘటన నేపథ్యంలో సరిహద్దుల్లో ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కొనేందుకు త్రివిధ దళాలు సిద్ధమవుతున్నాయి. సర్వసన్నద్ధంగా ఉండాలని ఆర్మీ, నేవీ, వైమానికదళాధిపతులకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. అత్యవసర సమయాల్లో ఆయుధాలు, యుద్ధ విమానాలు, నౌకలను వ్యూహాత్మక స్థానాల్లో మోహరించేందుకు కేంద్రం అనుమతిచ్చింది. మూడు విభాగాలను సమన్వయం చేసే బాధ్యతను సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌కు అప్పగించింది. సరిహద్దులోని కీలక ప్రాంతాలకు అదనపు బలగాలు, ఆయుధాలను తరలిస్తున్నారు. అవసరమైతే మలక్కా జలసంధిలో యుద్ధనౌకలను మోహరించేందుకు నేవీకి అనుమతి ఇచ్చారు. చైనా నౌకలు భారత్‌వైపు రావాలంటే ఈ జలసంధే కీలకమైంది. 


logo