బుధవారం 01 ఏప్రిల్ 2020
National - Mar 21, 2020 , 11:43:18

మహారాష్ట్ర - తెలంగాణ సరిహద్దులో అప్రమత్తం

మహారాష్ట్ర - తెలంగాణ సరిహద్దులో అప్రమత్తం

హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో మహారాష్ట్ర - తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. కామారెడ్డి జిల్లాలోని మద్నూర్‌ వద్ద పోలీసులు, వైద్యాధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. మహారాష్ట్ర నుంచి రాకపోకలు సాగిస్తున్న వారిని నిశితంగా పరిశీలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రయాణికుల వివరాలను కూడా పోలీసులు సేకరిస్తున్నారు. కరోనా నియంత్రణకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ర్టాల సరిహద్దుల వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ప్రతి చెక్‌పోస్టు వద్ద రవాణా శాఖ నుంచి ఇన్‌స్పెక్టర్‌ స్థాయి అధికారిని నియమించారు. రెవెన్యూ, పోలీసు, వైద్యారోగ్య శాఖ సిబ్బంది అక్కడే ఉండి విధులు నిర్వర్తిస్తున్నారు. 


logo
>>>>>>