సోమవారం 18 జనవరి 2021
National - Dec 05, 2020 , 21:26:22

ఉగ్రస్థావరాన్ని ఛేదించిన పోలీసులు.. ఆయుధాలు స్వాధీనం

ఉగ్రస్థావరాన్ని ఛేదించిన పోలీసులు.. ఆయుధాలు స్వాధీనం

జమ్మూకశ్మీర్‌ :  జమ్మూకాశ్మీర్‌లోని ఉగ్రవాదుల రహస్య స్థావరాన్ని పొలీసులు ఛేదించారు. ఆయుధాలను, పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. షీర్పొరా, నింబల్‌ ప్రాంతాల మధ్య ఉగ్ర స్థావరాలు ఉన్నట్లు బారాముల్ల పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. ఈ మేరకు సీఆర్‌పీఎఫ్‌ దళాలతో కలిసి ఆ ప్రాంతంలో నాకాబంధీ నిర్వహించి ఉగ్రవాదులు రహస్య స్థావరాన్ని గుర్తించారు. అక్కడ రెండు యూబీజీఎల్‌ గ్రెనేడ్లు, ఓ చైనీస్‌ గ్రెనేడ్‌, భారీగా మందులు, పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు జమ్మూకాశ్మీర్‌ పోలీసులు తెలిపారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.