శనివారం 28 మార్చి 2020
National - Mar 13, 2020 , 12:29:17

హోటల్‌లో ఉంటున్నారా.. సిక్రెట్‌ కెమెరాలు ఉంటాయి జాగ్రత్త...

హోటల్‌లో ఉంటున్నారా.. సిక్రెట్‌ కెమెరాలు ఉంటాయి జాగ్రత్త...

మహారాష్ట్ర : యాత్రలు, దూర ప్రయాణాలకు వెళ్లినప్పుడు ఉండటానికి హోటళ్లను ఆశ్రయిస్తుంటాం. హోటల్‌ రూంలో దిగగానే రూమ్‌ను ఒక సారి నిశితంగా పరిశీలించండి. ఎందుకంటే సీక్రెట్‌ కెమెరాలు ఉంటాయి జాగ్రత్తం. ఇటీవలే మహాబలేశ్వర్‌లోని బడ్జెట్‌ హోటల్‌ నుంచి పోలీసులు ఎల్‌ఈడీ బల్బ్‌లో ఫిట్‌ చేసిన సీక్రెట్‌ కెమెరాను సీజ్‌ చేశారు. హోటల్‌లో దిగిన ప్రయాణికుడు కెమెరా ఉన్నట్లు అనుమానించడంతో ఈ విషయం బయటపడింది. ఈ విషయంపై హోటల్‌ సిబ్బందిని నిలదీయడంతో వారు బెదిరింపులకు దిగారు. దీంతో మహారాష్ట్ర పోలీస్‌ ట్విట్టర్‌లో ఈ విషయాన్ని ప్రయాణికుడు పోస్టు చేయడంతో అది వైరల్‌గా మారింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


logo