శుక్రవారం 05 జూన్ 2020
National - May 13, 2020 , 19:07:20

హైదరాబాద్‌లోనే రెమ్డిసివిర్‌ తయారీ

హైదరాబాద్‌లోనే రెమ్డిసివిర్‌ తయారీ

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ చికిత్సలో కీలకంగా ఉపయోగిస్తున్న యాంటీ వైరల్‌ ఔషధం రెమ్డిసివిర్‌ త్వరలో హైదరాబాద్‌లోనే తయారుకానున్నది. ఈ ఔషధం తయారీ, పంపిణీ కోసం నాలుగు దేశీయ ఫార్మా కంపెనీలు అమెరికా సంస్థ గిలీడ్‌ సైన్సెస్‌తో నాన్‌ ఎక్స్‌క్లూజివ్‌ లైసెన్సింగ్‌ ఒప్పందం కుదర్చుకోనున్నాయి. వీటిలో హైదరాబాద్‌కు చెందిన హెటిరో ల్యాబ్స్‌, మైలాన్‌ సంస్థతోపాటు ముంబైకి చెందిన సిప్లా, నోయిడాలోని జుబిలెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌ ఉన్నాయి. ఈ ఒప్పందం ద్వారా నాలుగు సంస్థలకు గిలీడ్‌ నుంచి  సాంకేతిక బదిలీ అవనున్నది. రెమ్డిసివిర్‌ను వీలైనంత త్వరగా అందుబాటులోకి తెచ్చేందుకు వివిధ దేశాల నియంత్రణ సంస్థల ఆమోదంతో రెమ్డిసివిర్‌ ఉత్పత్తిని పెంచేందుకు ఈ ఒప్పందం దోహదపడనున్నది. భారత వైద్య పరిశోధనా మండలి నుంచి అనుమతి పొందగానే రెమ్డిసివిర్‌ ఔషధాన్ని తయారుచేయనున్నట్టు హెటిరో సంస్థ ప్రకటించింది.


logo