శుక్రవారం 03 జూలై 2020
National - Jun 15, 2020 , 08:58:11

హీరో సుశాంత్‌ను మ‌ర్డ‌ర్ చేశారు: ప‌ప్పూ యాద‌వ్‌

హీరో సుశాంత్‌ను మ‌ర్డ‌ర్ చేశారు: ప‌ప్పూ యాద‌వ్‌

హైద‌రాబాద్‌: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ముంబైలోని త‌న నివాసంలో ఉరి వేసుకుని చ‌నిపోయిన విష‌యం తెలిసిందే.  సుశాంత్ సూసైడ్ చేసుకున్న‌ట్లు ముంబై పోలీసులు చెబుతున్నారు. కానీ ఆ హీరో మ‌ర‌ణంపై కొంద‌రు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. సుశాంత్‌ను మ‌ర్డ‌ర్ చేశార‌ని జ‌న్ అధికార్ పార్టీ చీఫ్ ప‌ప్పూ యాద‌వ్ ఆరోపించారు. పాట్నాలోని సుశాంత్ ఇంటికి వెళ్లిన ప‌ప్పూ యాద‌వ్‌.. అక్క‌డ మీడియాతో మాట్లాడారు.  హీరో సుశాంత్‌.. ఆత్మ‌హ‌త్య చేసుకునే వ్య‌క్తి కాద‌న్నాడు.  సుశాంత్ మ‌ర‌ణం కేసులో సీబీఐ విచార‌ణ  చేప‌ట్టాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.  

పాట్నాలో ఉన్న సుశాంత్ కుటుంబ‌స‌భ్యులు కూడా హీరో మృతి ప‌ట్ల అనుమానాలు వ్య‌క్తం చేశారు. సుశాంత్ సూసైడ్ చేసుకున్న‌ట్లు మేం భావించ‌డం లేద‌ని ఆ హీరో బాబాయ్ తెలిపారు.  సుశాంత్  మ‌ర‌ణం వెనుక ఏదో మిస్ట‌రీ ఉన్న‌ట్లు ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. మా వాడిని మ‌ర్డ‌ర్ చేశార‌ని ఆయ‌న ఆరోపించారు. ఎంఎస్ ధోనీ, చిచ్చోరే, కేదార్‌నాథ్‌, సోంచిడియా లాంటి ఫేమ‌స్ చిత్రాల్లో సుశాంత్ హీరో పాత్ర పోషించాడు. 


logo