బుధవారం 27 మే 2020
National - May 07, 2020 , 19:54:43

మ‌హువా పూల‌తో శానిటైజ‌ర్

 మ‌హువా పూల‌తో శానిటైజ‌ర్

క‌రోనా వ్యాప్తి కార‌ణంగా హ్యాండ్ శానిటైజ‌ర్లతో పాటు వాటి ఉత్పత్తికి వాడే ఇథ‌నాల్ లేదా ఇథైల్ అల్కహాల్‌కి కూడా  కొర‌త ఏర్పడింది. ఇవేవీ అందుబాటులో లేనందున మధ్యప్రదేశ్‌లోనిఅలీరాజ్‌పూర్‌కు చెందిన  మ‌హిళ‌లు మ‌హువా పువ్వుల నుంచి సేక‌రించిన మ‌ధ్యంతో సేంద్రియ శానిటైజ‌ర్‌ను త‌యారు చేస్తున్నారు.శ్రీ‌హ‌రి అజీవికా అనే స్వయం స‌హాయ‌క  బృందంతో క‌లిసి సువాస‌న గ‌ల మ‌హువా నుంచి శానిటైజ‌ర్ త‌యారీకి పూనుకున్నారు. 'శానిటైజ‌ర్ కొర‌త‌కు ప‌రిష్కారం దొరుకుతుందేమో అని యూట్యూబ్లో సెర్చ్ చేశారు. ఈ పూల నుంచి మ‌ద్య పానీయం సమస్యను పరిష్కరించ వచ్చని తెలుసుకున్నారు'. ఈ విష‌యాన్ని భార‌తి అనే మ‌హిళ చెప్పుకొచ్చింది. సువాస‌న కోసం రోజ్‌వాట‌ర్ ఉప‌యోగిస్తున్నారు. ల్యాబ్ టెస్టింగ్ కోసం బ్లాక్ మెడికల్ ఆఫీసర్‌కు పంపిస్తారు. అన్ని పరీక్షల త‌ర్వాత రూ.70కు  విక్రయిస్తారు. ఒక్కో బాటిల్‌కు కేవ‌లం రూ.5 లాభం ఉంటుంది. ఇప్పటి వరకు ఈ మ‌హిళ‌లు 300ల‌కు పైగా బాటిళ్లు త‌యారు చేశారు. వీటిని ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బ‌రోడా శాఖ‌లు ఉప‌యోగిస్తున్నాయి. ఉదయగర్ జనపాద్ పంచాయతీతో పాటు ఎంఎన్ఆర్ఈజీఏ కార్మికులు, కొంతమంది ఉపాధ్యాయులు గ్రామంలో కూడా పంపిణీ చేస్తున్నారు.logo