మంగళవారం 04 ఆగస్టు 2020
National - Jul 28, 2020 , 18:06:36

రోడ్డుకి అడ్డంగా జీబ్రాల గుంపు.. ఏనుగును అడ్డుకునేందుకు స్కెచ్‌!

రోడ్డుకి అడ్డంగా జీబ్రాల గుంపు.. ఏనుగును అడ్డుకునేందుకు స్కెచ్‌!

సోష‌ల్ మీడియాలో ప్ర‌తిరోజూ వ‌న్య‌ప్రాణులు తార‌స‌ప‌డాల్సిందే. వాటిని చూడ‌క‌పోతే పొద్దే గ‌డ‌వ‌దు అన్న‌ట్లుగా మారింది. అడ‌వుల్లో ప్ర‌తి చిన్న సంఘ‌ట‌న‌ల‌ను సోష‌ల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు ఫారెస్ట్ అధికారులు. ఈ రోజు కూడా రెండు వేర్వేరు జాతుల వ‌న్య‌ప్రాణులు తార‌స‌ప‌డ్డాయి. పెద్ద ఆకారంలో ఉన్న ఏనుగు న‌డిచే దారిలో గుంపుగా కొన్ని జీబ్రాలు నిల్చొని ఉన్నాయి.

36 సెకండ్ల‌పాటు న‌డిచే ఈ వీడియోలో ఐదు జీబ్రాలు రోడ్డుకి అడ్డంగా నిల్చొని ఉన్నాయి. అరే భ‌లే ఉన్నాయే అనుకునేస‌రికి ఎదురుగా ఏనుగు న‌డుచుకుంటూ వ‌స్తుంది. ఓహో.. ఏనుగుకి ఏదో స్కెచ్ వేసిన‌ట్లు అనిపించేస‌రికి మ‌రింత ఆస‌క్తిక‌రంగా మారింది. తీరా ఏనుగు ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేస‌రికి జీబ్రాలు ప‌క్క‌కు పారిపోయాయి. ఏదేమైనా ఏనుగు ముందు వీటి ఆట‌లు సాగుతాయా? ఈ వీడియోను ఇండియ‌న్ ఫారెస్ట్ స‌ర్వీస్ ఆఫీస‌ర్ సుశాంత నందా ట్విట‌ర్‌లో షేర్ చేశారు. 'భారీ ట్రాఫిక్. గౌరవం & మార్గం చేయండి' అనే శీర్షిక‌ను జోడించారు. ఇప్పుడు నెట్టింట్లో హ‌ల్‌చ‌ల్ చేస్తున్న‌ది. logo