శనివారం 30 మే 2020
National - May 24, 2020 , 00:34:31

కోడిగుడ్డులో ఆకుపచ్చ సొన

కోడిగుడ్డులో ఆకుపచ్చ సొన

మలప్పురం: కేరళలోని మలప్పురంలో ఆకుపచ్చ సొన ఉన్న కోడిగుడ్లు సామాన్యులతోపాటు సైంటిస్టుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఒతుక్కుంగల్‌లోని ఏకే షిహాబుద్దీన్‌ అనే రైతు వద్ద ఉన్న కోళ్లలో ఆరు కోళ్లు కొంతకాలంగా ఆకుపచ్చ సొన ఉన్న గుడ్డు పెడుతున్నాయి. దీంతో రాష్ట్రంలోని కేవీఏఎస్‌యూ శాస్త్రవేత్తలు ఈ గుడ్లను పరిశీలించారు. గుడ్డులో ఆకుపచ్చ సొన ఎందుకు ఏర్పడింతో తెలుసుకునేందుకు మూడు వారాలు పడుతుందని అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ హరికృష్ణన్‌ తెలిపారు.


logo