ఆదివారం 27 సెప్టెంబర్ 2020
National - Aug 14, 2020 , 12:01:51

ముంబైని ముంచెత్తుతున్న భారీ వర్షాలు

ముంబైని ముంచెత్తుతున్న భారీ వర్షాలు

ముంబై : దేశ ఆర్థిక రాజధాని ముంబైని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు లోతట్లు ప్రాంతాలు జలమయమై చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లపై వరద నీరు నీలిచి వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కరోనా మహమ్మారికి కుండపోత వానలు తోడవడంతో జనం బయటకు రావాలంటే జంకుతున్నారు. శుక్రవారం సైతం ముంబై మహానగరంతోపాటు ధానే, పాల్ఘర్, రాయ్గడ్, రత్నగిరి, సింధుదుర్గ్ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ  వర్షం కురిసే అవకాశం ఉందని  భారత వాతావరణశాఖ అంచనా వేసింది. ముంపు ప్రాంతాల్లో బ్రిహాన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.   


logo