బుధవారం 30 సెప్టెంబర్ 2020
National - Aug 13, 2020 , 08:18:36

ఢిల్లీలో భారీ వ‌ర్షాలు.. లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌యం

ఢిల్లీలో భారీ వ‌ర్షాలు.. లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌యం

న్యూఢిల్లీ : దేశ రాజ‌ధాని ఢిల్లీలో గురువారం ఉద‌యం నుంచి కుండ‌పోత వ‌ర్షం కురుస్తోంది. భారీ వ‌ర్షాల‌తో ఢిల్లీ అత‌లాకుత‌ల‌మ‌వుతోంది. లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌యం అయ్యాయి. ద్వార‌కాలోని అండ‌ర్‌పాస్ జ‌ల‌మ‌యం అయింది. దీంతో వాహ‌నాల రాక‌పోక‌లకు తీవ్ర ఆటంకం క‌లిగింది. న్యూఢిల్లీ రైల్వేస్టేష‌న్ ఏరియాలో వ‌ర‌ద నీరు చేర‌డంతో.. స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఢిల్లీతో పాటు నోయిడా, రోహ‌తక్, జింద్, గురుగ్రామ్, ఘ‌జియాబాద్‌, ఫ‌రిదాబాద్‌, ఆగ్రా, బులంద్‌ష‌ర్ ప్రాంతాల్లో మ‌రో రెండు గంట‌ల పాటు ఉరుములు, మెరుపుల‌తో కూడిన వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు వెల్ల‌డించారు.

ఢిల్లీలో గ‌డిచిన ప‌దేళ్ల‌లో అత్యంత త‌క్కువ వ‌ర్ష‌పాతం న‌మోదు

ఢిల్లీలో గ‌డిచిన ప‌దేళ్ల‌లో ఈ ఏడాది ఆగ‌స్టులో సాధార‌ణ వ‌ర్ష‌పాతం కంటే అతి త‌క్కువ వ‌ర్ష‌పాతం న‌మోదు అయింద‌ని భార‌త వాతావ‌ర‌ణ శాఖ అధికారులు తెలిపారు. ఆగ‌స్టు నెల‌లో 72 శాతం వ‌ర్ష‌పాతం న‌మోదైన‌ట్లు అధికారులు చెప్పారు. గ‌తేడాది ఆగస్టు నెల‌లో మొద‌టి 12 రోజులు.. 37.1 మి.మీ. వ‌ర్ష‌పాతం న‌మోదైంది. 


logo