సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 20, 2020 , 01:44:34

ఉత్తరాదిలో భారీ వర్షాలు

ఉత్తరాదిలో భారీ వర్షాలు

  • ఢిల్లీలో కుంభవృష్టి.. నలుగురు మృతి l ఉత్తరాఖండ్‌లో కొట్టుకుపోయిన బ్రిడ్జి

న్యూఢిల్లీ: ఉత్తర, ఈశాన్యభారతదేశంలో వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఢిల్లీలో ఆదివారం భారీ వర్షాలతో వరదలు పోటెత్తటంతో ఓ బాలుడు సహా నలుగురు వ్యక్తులు మరణించారు. మింటో బ్రిడ్జ్‌ అండర్‌పాస్‌లో మినీ ట్రక్‌ నీటిలో మునిగిపోవటంతో కుందన్‌ కుమర్‌ అనే డ్రైవర్‌ చనిపోయారు. నగరంలోని చాలా ఇండ్లల్లోకి భారీగా వరద నీరు చేసింది. ఐటీవో ప్రాంతంలో నాలాకు ఆనుకొని నిర్మిస్తున్న ఓ భవనం వరదనీటిలో కొట్టుకుపోయింది. ఉదయం 8.30వరకే నగరంలో 74.8 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని వాతావరణశాఖ తెలిపింది. కేజ్రీవాల్‌ ప్రభుత్వం వరద ప్రమాదాన్ని నివారించలేకపోయిందని కాంగ్రెస్‌, బీజేపీ విమర్శించాయి. సీఎం కేజ్రీవాల్‌ మాత్రం ప్రభుత్వంలోని అన్ని విభాగాలు కరోనాపై పోరాటంలో బిజీగా ఉన్నాయని, ఈ సమయంలో వర్షాలపై రాజకీయాలు చేయరాదని సూచించారు. హిమాచల్‌ప్రదేశ్‌లో బద్‌సెరి అనే గ్రామం మొత్తం వరద నీటిలో కొట్టుకుపోయింది. ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలకు గోరి నది ఉప్పొంగటంతో నాలుగు ఇండ్లు కొట్టుకుపోయాయి. పితోర్‌గఢ్‌ సమీపంలోని మధ్‌కోట్‌ వద్ద ఉన్న బ్రిడ్జి వరదకు పాక్షికంగా కొట్టుకుపోయింది.

అసోం అతలాకుతలం 

భారీ వర్షాలు, వరదలకు ఈశాన్యరాష్ట్రం అసోం తల్లడిల్లుతున్నది. భారీ వరదలకు ఆదివారం ఐదుగురు మరణించటంతో ఈ ఏడాది వరదల కారణంగా మరణించినవారి సంఖ్య 110కి చేరింది. 25లక్షల మది నిరాశ్రయులయ్యారు. రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాలకుగాను 24 జిల్లల్లో వరదల తీవ్రత అధికంగా ఉన్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్‌తో మాట్లాడిన ప్రధాని నరేంద్రమోదీ వరద పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రాష్ర్టాన్ని అన్నివిధాలుగా ఆదుకొంటామని హామీ ఇచ్చారు.logo