గురువారం 09 జూలై 2020
National - Jun 19, 2020 , 12:07:25

పాట్నాలో భారీ వర్షం జలమమయమైన రోడ్లు

పాట్నాలో భారీ వర్షం జలమమయమైన రోడ్లు

పాట్నా : బిహార్‌ రాష్ట్రంలోని పాట్నా పరిధి ఖదంకువాన్‌ ప్రాంతంలో శుక్రవారం భారీ వర్షం కురిసింది. దీంతో అక్కడి రోడ్లన్నీ జలమయమయ్యాయి. వరద ఇండ్లలోకి చేరడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోజువారీ వ్యాపారులు ఇండ్లకే పరిమితమయ్యారు. మోకాళ్ల లోతు నీళ్లు నిలవడంతో ద్విచక్రవాహనదారులు, పాదాచారులు రోడ్లమీద నడువలేని పరిస్థితి నెలకొంది. ఖదంకువాన్‌ ప్రాంతంలోని పలు కాలనీల్లో రోడ్ల వెంటే చెత్త వేయడంతో వరదకు చెత్తతో పాటు మురుగు కూడా ఇండ్ల ఎదుట నిలువడంతో దుర్వాసన వస్తుందని జనం అంటున్నారు. ప్రస్తుతం కరోనా వేగంగా వాపిస్తోంది.. దీనికి తోడు వర్షాలు కురిసి వరద రోడ్లు, ఇండ్లలోకి వస్తుండడంతో అంటు వ్యాధులు విజృంభిస్తే పరిస్థితి ఎలా ఉంటుందోనని జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  logo