ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 10, 2020 , 15:49:23

తమిళనాడులో భారీ వర్షాలు

తమిళనాడులో భారీ వర్షాలు

చెన్నై : తమిళనాడు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గడిచిన 24గంటల్లో భారీ వర్షాలు కురిసినట్లు చెన్నైలోని ప్రాంతీయ వాతావరణ కేంద్ర డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ ఎస్‌ బాలచంద్రన్‌ శుక్రవారం తెలిపారు. రాష్ట్రంలోని వాతావరణం తూర్పు, పడమర మధ్యభాగంలో పతన సంకర్షణ చెందుతుండడంతో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఎర్కాడ్‌‌ జిల్లాలో గురువారం రాత్రి 20సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వెల్లడించారు. రానున్న 24గంటల్లో రాష్ట్రంలోని ఉత్తరభాగంతోపాటు పలు అంతర్గత జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశముందని చెప్పారు. చెన్నైలో పగడిపూట ఆకాశం మేఘావృతమై ఉండి తెల్లవారుజూమున లేదా రాత్రి వర్షం కురిసే అవకాశముందని పేర్కొన్నారు. నైరుతి రుతుపవనాల కారణంగా దేశవ్యాప్తంగా జులై 1నుంచి 10 వరకు 39శాతం అధిక వర్షపాతం నమోదైనట్లు ఆయన వివరించారు.   logo