శనివారం 24 అక్టోబర్ 2020
National - Aug 12, 2020 , 15:08:01

మూడు రోజులు భారీ వర్షాలు.. కర్ణాటక తీరప్రాంత జిల్లాల్లో ఎల్లో అలెర్ట్

మూడు రోజులు భారీ వర్షాలు.. కర్ణాటక తీరప్రాంత జిల్లాల్లో ఎల్లో అలెర్ట్

న్యూఢిల్లీ: దేశంలోని పలు చోట్ల రెండు నుంచి మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ స్థాయి వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. వాయువ్య భారతదేశంలో ప్రధానంగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్‌లోని పలు ప్రాంతాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఈ నెల 12 నుంచి 15 వరకు గుజరాత్, తూర్పు రాజస్థాన్, మధ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు, కొంకణ్, ఉత్తర గోవాలో అతి భారీ వర్షాలు కురుస్తామని ఐఎండీ పేర్కొంది. రాబోయే 24 గంటల్లో తూర్పు రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్‌లోని కొన్నిచోట్ల మెరుపులు, ఉరుములతోపాటు తేలికపాటి నుంచి మాదిరి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

మరోవైపు ఈ నెల 12 నుంచి 16 వరకు ఉత్తర కన్నడ, ఉడిపి, దక్షిణా కన్నడ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కర్ణాటకలోని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఈ నేపథ్యంలో తీరప్రాంత జిల్లాల్లో ఎల్లో అలెర్ట్ జారీ చేసినట్లు పేర్కొంది.

logo