ఆదివారం 05 జూలై 2020
National - Jun 20, 2020 , 09:00:57

ఢిల్లీలో భారీ వ‌ర్షం!

ఢిల్లీలో భారీ వ‌ర్షం!

న్యూఢిల్లీ: ఢిల్లీలో ఈ రోజు తెల్ల‌వారుజామున‌ భారీ వ‌ర్షం కురిసింది. ఉద‌యం 4 గంట‌ల నుంచే బ‌ల‌మైన గాలులతో కూడిన వ‌ర్షం ప‌డింది. గంట‌కు 30 నుంచి 50 కిలోమీట‌ర్ల వేగంతో గాలు వీచాయ‌ని భార‌త వాతావ‌ర‌ణ కేంద్రం (ఐఎండీ) వెల్ల‌డించింది. ఢిల్లీ, నేష‌న్ క్యాపిట‌ల్ రీజియ‌న్‌లోని ఫ‌రీదాబాద్‌, ఘ‌జియాబాద్‌, నోయిడా, గ్రేట‌ర్ నోయిడాతోపాటు హిసార్‌, హ‌న్సి, జింద్‌, మెహ‌మ్‌, భివాని, రోహ్‌త‌క్ ప్రాంతాల్లో వ‌ర్షం ప‌డింది. 

దీంతో ఢిల్లీలో లోత‌ట్టు ప్రాంతాల‌న్నీ జ‌ల‌మ‌య‌మ‌య్యాయి. ప‌లు ప్రాంతాల్లో చెట్ల కొమ్మ‌లు విరిగిప‌డ్డాయి. కాగా, ఈ నెల 25 క‌ల్లా ఢిల్లీ, హ‌ర్యానా రాష్ట్రాల్లోకి నైరుతి రుతు ప‌వ‌నాలు ప్ర‌వేశిస్తాయ‌ని ఐఎండీ తెలిపింది. ప్ర‌స్తుతం రుతుప‌వానాలు స‌మీపిస్తున్నందునే ఢిల్లీ, ప‌రిస‌ర ప్రాంతాల్లో వ‌ర్షాలు ప‌డుతున్నాయ‌ని వారు చెప్పారు.             


logo