సోమవారం 03 ఆగస్టు 2020
National - Jul 09, 2020 , 14:33:20

ఐదు రోజులపాటు భారీ వర్షాలు

ఐదు రోజులపాటు భారీ వర్షాలు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పలు చోట్ల ఐదు రోజుల పాటు భారీగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తర పంజాబ్, ఉత్తరప్రదేశ్, బీహార్, హర్యానా, పశ్చిమబెంగాల్, సిక్కింతోపాటు ఈశాన్య రాష్ట్రాలతోపాటు పలు రాష్ట్రాల్లో మెస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నదని చెప్పింది. మహేందర్‌గఢ్, బావాల్, హోడాల్, బర్సనా, డీగ్, భరత్‌పూర్, ఆగ్రా, మధుర, హత్రాస్, అలీగడ్, తుండ్లా, ఫిరోజాబాద్, గంజుంద్వరా ప్రాంతాలలో గురువారం ఉరుములతో కూడిన వర్షం కురుస్తుందని ఐఎండీ పేర్కొంది. మరోవైపు మహారాష్ట్రలోని సముద్ర తీరంలో అలలు ఉవ్వెత్తున ఎగసిపడే అవకాశమున్నదని హెచ్చరించింది.


logo