ఇస్లామాబాద్ : దేశంలో కొనసాగుతున్న ఆందోళనలను నివారించేందుకు పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ నిషేధిత తెహ్రీక్ ఏ లాబ్‌బాయిక్ (టీఎల్పీ) ముందు మోకరిల్లారు. ఆందోళనాకారుల ఆగ్రహావేశాలను చల్లార్చేందుకు ఫ్రెంచ్ రాయబారిని బహిష్కరించే ఆలోచిన చేస్తున్నట్లు తెలుస్తున్నది. అయితే నిషేధిత సంస్థతో చర్చలు జరపడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యపై పోలీసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
లాహోర్‌లో జరిగిన సంఘటన అనంతరం టీఎల్పీ వారం రోజుల పాటు దేశవ్యాప్త నిరసనలు నిర్వహించింది. నిరసనల సందర్భంగా జరిగిన హింసాకాండలో దేశవ్యాప్తంగా వందలాది మంది పోలీసులు, నిరసనకారులు గాయపడ్డారు. ఈ హింసలో ఆరుగురు పోలీసులు మరణించగా.. 800 మందికి పైగా గాయపడ్డట్లు అరబ్ న్యూస్ కథనం. నిరసన సందర్భంగా వివిధ నగరాలు, పట్టణాల్లో వివిధ పోలీసు వాహనాలు కాలిపోయాయి. అనేక పోలీస్ స్టేషన్లపై దాడులు కొనసాగాయి.
ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై ఒత్తిళ్లు పెరుగడంతో వారం క్రితం టీఎల్పీ చీఫ్ సాద్ రజ్వీని ప్రభుత్వం విడిచిపెట్టింది. తమ డిమాండ్లను పరిష్కరించేంత వరకు ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై పోరాడుతామని టీఎల్పీ కార్యకర్తలు అంటున్నారు. మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఫ్రెంచి వార్తపత్రిక, ఆ దేశ ప్రధానికి నిరసన తెలుపుతూ వారి రాయబారిని బహిష్కరించాలని టీఎల్పీ మొదటి డిమాండ్‌గా ఉన్నది.
దేశంలో ఆందోళలను తగ్గించేందుకు ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం టీఎల్పీతో మాట్లాడి ఒప్పందం కుదుర్చుకోవడానికి ఒక మార్గాన్ని కనుగొంటుంది. తమపై దాడి చేసి చంపడమే కాకుండా పలువురిని బందీలుగా పట్టుకున్నవారిపై చర్యలు తీసుకోకుండా రాజీకి రావడం పోలీసులకు ఆగ్రహం తెప్పిస్తున్నది. హింసాకాండ సందర్భంగా అరెస్టయిన టీఎల్పీ కార్యకర్తలను నిర్దోషులుగా ప్రకటించాలన్న డిమాండ్‌ను ప్రభుత్వ మంత్రులు పరిశీలిస్తున్నారు. సాద్ రజ్వీపై నమోదైన కేసులను ఉపసంహరించుకుంటామని హామీ ఇవ్వనున్నట్లు తెలుస్తున్నది.
అమెరికాతో పోరు ఎప్పటికీ ముగియదు : అల్ ఖైదా
మహిళల ఆరోగ్య అవసరాలపై దృష్టి పెట్టాలి: వెంకయ్యనాయుడు
ఆరోగ్యకర జీవితానికి ప్రణాళికలు.. ఇవి పాటిస్తే చాలు హాయిగా ఉండొచ్చు!
కరోనా కాటుకు షూటర్ దాదీ కన్నుమూత
హిమగ్లోబిన్ పెరిగితే ఇమ్యూనిటీ పెరుగుతుంది.. అందుకు ఏం చేయాలంటే..?
కరోనా ఎక్కడుందన్నాడు.. దానికే బలయ్యాడు.. ఓ ఎమ్మెల్యే కథ
సినిమా మరిచిపోలేని మహా మనీషి.. చరిత్రలో ఈరోజు
ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకినట్లు ఎలా గుర్తించాలి?
ఈ విటమిన్ సీ పండ్లు తినండి.. రోగనిరోధక శక్తి పెంచుకోండి..!
అంతరిక్ష కేంద్రం మొదటి మాడ్యూల్‌ను ప్రయోగించిన చైనా
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..