ఆదివారం 05 జూలై 2020
National - Jun 25, 2020 , 17:12:23

అసోంలో భారీ వ‌ర్షం.. పోటెత్తిన వ‌ర‌ద‌లు

అసోంలో భారీ వ‌ర్షం.. పోటెత్తిన వ‌ర‌ద‌లు

న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రం అసోంలో వ‌రుణుడు బీభ‌త్సం సృష్టిస్తున్నాడు. గ‌త 24 గంట‌లుగా ఎడ‌తెర‌పిలేని వాన‌లు కురుస్తుండ‌టంతో రాష్ట్రంలో వ‌ర‌ద‌లు పోటెత్తాయి. ముఖ్యంగా టిన్‌సుకియాలోని డ‌మ్‌డ‌మ్ ఏరియాను భారీ వ‌ర‌ద‌లు ముంచెత్తాయి. లోత‌ట్టు ప్రాంతాల‌న్నీ జ‌ల‌మ‌య‌మ‌య్యాయి. ప‌లుచోట్ల రోడ్ల‌పై భారీగా వ‌ర‌ద‌నీరు నిలిచింది. టిన్‌సుకియాలోని వాగులు, వంక‌లు ఉప్పొంగి ప్ర‌వ‌హిస్తున్నాయి. దీంతో ఆయా ప‌రిస‌రాల్లోని గ్రామాలు వ‌ర‌ద నీటిలో చిక్కుకున్నాయి. వీధుల్లో న‌డుములోతు నీరు నిలువ‌డంతో ఇండ్లు నీట మునిగాయి.    


logo