శనివారం 24 అక్టోబర్ 2020
National - Sep 22, 2020 , 13:47:57

పశ్చిమబెంగాల్‌, సిక్కిం, గోవాల్లో భారీ వర్షాలు : ఎన్‌డీఎంఏ

పశ్చిమబెంగాల్‌, సిక్కిం, గోవాల్లో భారీ వర్షాలు : ఎన్‌డీఎంఏ

న్యూఢిల్లీ : రానున్న 24 గంటల్లో పశ్చిమబెంగాల్‌తోపాటు సిక్కిం, కొంకణ్‌, గోవా, హిమాలయ పరివాహాక ప్రాంతాలతోపాటు ద్వీపకల్పన ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ మంగళవారం తెలిపింది. ద్వీపకల్ప ప్రాంతాలైన కొంకణ్‌, గోవాల్లో సోమవారం నుంచే భారీ వర్షాలు కురస్తున్నాయని వెల్లడించింది. పశ్చిమబెంగాల్‌తోపాటు హిమాలయ పరివాహాక ప్రాంతాల్లో రానున్న రెండురోజులు ఇదే పరిస్థితి ఉండొచ్చని అంచనా వేసింది. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని సూచించింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo