ఆదివారం 09 ఆగస్టు 2020
National - Aug 02, 2020 , 19:03:08

‘కేరళలో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం’

‘కేరళలో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం’

తిరువనంతపురం : కేరళ రాష్ట్రంలోని ఇడుక్కీ, కోజికోడ్, కన్నూర్, కాసర్‌గోడ్‌ జిల్లాల్లో రేపు భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఆదివారం వెల్లడించింది. ఆయా జిల్లాల్లో సోమవారం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భారీ నుంచి అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వచ్చే నాలుగైదు రోజుల్లో మహారాష్ట్రలోని పలు ప్రాంతాలతోపాటు కొంకణ్ తీర ప్రాంతంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణశాఖ అంచనా వేసింది.


logo