బుధవారం 05 ఆగస్టు 2020
National - Jul 05, 2020 , 07:05:17

ఢిల్లీలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం

ఢిల్లీలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం తెల్లవారుజాము నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ఢిల్లీ నగరంతోపాటు, ఎన్‌సీఆర్‌ పరిధిలోని చాలా ప్రాంతాల్లో గంటకు 20 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షం కొనసాగే అవకాశం ఉన్నదని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఢిల్లీలో ఆకాశం మేఘావృతమై ఉండటంతోపాటు భారీ వర్షాలు కురవచ్చని అధికారులు వెల్లడించారు. 


ఢిల్లీలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం వచ్చే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ (ఐఎండీ) శనివారం సాయంత్రం ప్రకటించింది. వచ్చే 24 గంటల్లో ఢిల్లీతోపాటు దాని పరిసర ప్రాంతాలైన హన్సీ, నార్వానా, కైతాల్‌, హిస్సార్‌, జింద్‌, రోహ్‌తక్‌, నోయిడా, గ్రేటర్‌ నోయిడా, ఘజియాబాద్‌, ఫరీదాబాద్‌, బులంద్‌షహర్‌, గన్నౌర్‌, సోనిపట్‌, బరౌట్‌, పానిపట్‌, షామ్లీ, ముజఫర్‌నగర్‌, బిజ్నోర్‌, భివానీ, మహేందర్‌గఢ్‌, కోస్లీ, గురుగ్రామ్‌, మానెసర్‌, రెవారీ, నార్నాల్‌, మీరట్‌లలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. 


logo