మంగళవారం 07 జూలై 2020
National - Jun 23, 2020 , 18:37:23

కేరళకు భారీ వర్ష సూచన.. ఆరెంజ్‌ హెచ్చరిక జారీ

కేరళకు భారీ వర్ష సూచన.. ఆరెంజ్‌ హెచ్చరిక జారీ

తిరువనంతపురం : రానున్న మూడు రోజుల్లో కేరళకు భారీ వర్ష సూచన ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు ఐఎండీ కేరళలోని పలు జిల్లాలకు ఆరెంజ్‌ హెచ్చరికలను జారీ చేసింది. ఈ నెల 26న రాష్ట్రంలోని తిరువనంతపురం, కొల్లాం, పతనమిట్టి, ఇడుక్కి, వయనాడ్‌, కోజికోడ్‌ జిల్లాల్లో వర్షాలు కురువనున్నట్లు తెలిపింది. ఐఎండీ తెలిపిన ప్రకారం ఈ నెల 27న వయనాడ్‌, కోజికోడ్‌ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురువనున్నట్లు సమాచారం.

నైరుతి రుతుపవనాలు ఉత్తర అరేబియా సముద్రం, కచ్‌లోని చాలా భాగాలు, గుజరాత్‌ ప్రాంతంలోని మరికొన్ని భాగాలు, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లోని కొన్ని ప్రాంతాల్లోకి ముందుకు వచ్చాయని తెలిపింది. గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమ హిమాలయ ప్రాంతం, హర్యానా, చండీగఢ్‌, ఢిల్లీ, పంజాబ్‌లోని చాలా ప్రాంతాలు, రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో  మరో 48 గంటల్లో నైరుతి రుతుపవనాలు విస్తరించనున్నాయని వెల్లడించింది.  


logo