ఆదివారం 05 జూలై 2020
National - Jun 29, 2020 , 20:48:25

ఢిల్లీలో ఈదురుగాలుల‌తో జోరు వాన‌

ఢిల్లీలో ఈదురుగాలుల‌తో జోరు వాన‌

న్యూఢిల్లీ: నైరుతి రుతుప‌వ‌నాల ప్ర‌భావంతో ఉత్త‌రాది రాష్ట్రాల్లో భారీగా వ‌ర్షాలు కురుస్తున్నాయి. సోమ‌వారం సాయంత్రం ఉన్న‌ట్టుండి వాతావ‌ర‌ణం ఒక్క‌సారిగా మారిపోయింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలుల‌తో కూడిన భారీ వ‌ర్షం కురిసింది. దీంతో ఢిల్లీలోని ప‌లు ప్రాంతాలు జ‌ల‌మ‌య‌మ‌య్యాయి. విజ‌య్ చౌక్, ఇండియా గేట్ ప్రాంతాల్లో భారీ వ‌ర్షం కురిసింది. సోమ‌వారం ఢిల్లీలో ఆకాశం మేఘావృత‌మై ఉంటుంద‌ని, అక్క‌డ‌క్క‌డ తేలిక‌పాటి జ‌ల్లులు ప‌డే అవ‌కాశం ఉంద‌ని భార‌త వాతావ‌ర‌ణ కేంద్రం ఆదివారం సాయ‌త్రం అంచ‌నా వేసింది. అయితే ఐఎండీ అంచ‌నాల‌కు విరుద్ధంగా ఈరోజు ఢిల్లీలో ప‌లు ప్రాంతాల్లో భారీగా వ‌ర్షం ప‌డింది. గ‌త కొద్ది రోజులుగా ఉక్క‌పోత‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న ఢిల్లీ వాసులకు ఈ వ‌ర్షం ఉప‌శ‌మ‌నాన్ని ఇచ్చింది.                                                                                      

 


logo