గురువారం 02 జూలై 2020
National - Jun 28, 2020 , 17:48:02

బీహార్‌లో భారీ వ‌ర్షాలు.. మంత్రి ఇంట్లోకి వ‌ర‌ద నీరు

బీహార్‌లో భారీ వ‌ర్షాలు.. మంత్రి ఇంట్లోకి వ‌ర‌ద నీరు

ప‌ట్నా: బీహార్‌లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతుప‌వ‌నాల ప్ర‌భావంతో రాష్ట్ర‌మంత‌టా విస్తారంగా వాన‌లు ప‌డుతున్నాయి. దీంతో లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌య‌మ‌య్యాయి. ప‌లుచోట్ల నాలాలు ఉప్పొంగి ప్ర‌వ‌హిస్తున్నాయి. ఆదివారం ఎడతెర‌పి లేకుండా వ‌ర్షం కురుస్తుండ‌టంతో బీహార్ రాజ‌ధాని ప‌ట్నాలో రోడ్ల‌పై భారీగా వ‌ర‌ద నీరు నిలిచింది. ప‌లుచోట్ల నివాస ప్రాంతాల్లోకి, అపార్టుమెంట్ల సెల్లార్ల‌లోకి వ‌ర‌ద నీరు చేరింది. ప‌ట్నాలోని బీహార్ రోడ్డు నిర్మాణ శాఖ మంత్రి నంద్ కిశోర్ యాద‌వ్‌కు కూడా వ‌ర‌ద ముప్పు త‌ప్ప‌లేదు. ఆయ‌న ఇంటి ప‌రిస‌రాల్లో భారీగా వ‌ర‌ద‌నీరు నిలిచింది. 

దీంతో ప‌ట్నా మున్సిప‌ల్ కార్పొరేష‌న్ అధికారులు రంగంలోకి దిగి వ‌ర‌ద నీరు సాఫీగా వెళ్లేలా చ‌ర్య‌లు చేప‌డుతున్నారు. ప‌లు ప్రాంతాల్లోని నాలాల్లో ఏర్ప‌డిన అడ్డంకుల‌ను తొల‌గిస్త‌స్తున్నారు. కాగా, బీహార్‌లో రాగ‌ల రెండు రోజులపాటు కూడా భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్ర‌వ్యాప్తంగా రాగ‌ల రెండు రోజుల్లో 12 సెంటీమీట‌ర్ల వ‌ర్ష‌పాతం న‌మోద‌య్యే అవ‌కాశం ఉంద‌ని వారు చెప్పారు.    ‌ logo