ఆదివారం 05 జూలై 2020
National - Jun 22, 2020 , 19:13:01

ఏడు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన : ఐఎండీ

ఏడు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన : ఐఎండీ

న్యూఢిల్లీ : చురుగ్గా కదులుతున్న రుతుపవనాలతో ఈ నెల 24-26 మధ్య ఈశాన్య రాష్ట్రాల్లో విస్తారంగా, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. హిమాలయ పశ్చిమ బెంగాల్, బీహార్‌లోని పలు ప్రాంతాలతో పాటు అసోం, మేఘాలయ, అరుణాచల్‌ప్రదేశ్‌, మణిపూర్‌, మిజోరాం, త్రిపుర రాష్ట్రాలల్లో ఆరెంజ్‌ కెటగిరీ హెచ్చరిక జారీ చేసినట్లు ఐఎండీ తెలిపింది. ప్రస్తుతం అల్పపీడనం ఉత్తర పంజాబ్ నుంచి వాయవ్య బంగాళాఖాతం వరకు ఉందని, ఇది తూర్పు చివర నుంచి జూన్ 24 నుంచి ఉత్తరదిశగా మారే అవకాశం ఉందని పేర్కొంది. ఈశాన్య, తూర్పు భారతదేశం మీదుగా బంగాళాఖాతం నుంచి బలమైన తేమతో కూడిన గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే ఉత్తర ఇంటీరియర్ ఒడిశా మీదుగా కూడా తుఫానులుంటాయని, రాబోయే మూడు రోజుల్లో వాయువ్య దిశగా కదులుతుందని చెప్పింది. వీటి ప్రభావంతో రాబోయే 24 గంటల్లో మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని పలు ప్రాంతాలు, పశ్చిమ హిమాలయ ప్రాంతం, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పంజాబ్‌లోని చాలా ప్రాంతాల్లో రుతుపవనాలు మరింత విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలిపింది. 


logo