శుక్రవారం 03 జూలై 2020
National - Jun 15, 2020 , 19:24:41

నాసిక్‌లో కుండ‌పోత వ‌ర్షం

నాసిక్‌లో కుండ‌పోత వ‌ర్షం

ముంబై: ‌నైరుతి రుతు ప‌వ‌నాల ప్ర‌భావంతో మ‌హారాష్ట్ర‌లో విస్తారంగా వ‌ర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్ర‌వ్యాప్తంగా నిత్య ఏదో ఒకచోట వాన‌లు ప‌డుతూనే ఉన్నాయి. శుక్ర‌వారం నాసిక్ ఏరియాలో కుండ‌పోత వ‌ర్షం కుర‌సింది. దీంతో ఆ న‌గ‌రంలోని లోత‌ట్టు ప్రాంతాల‌న్ని జ‌ల‌మ‌య్యాయి. రోడ్ల‌పైకి వ‌ర‌ద‌లు పోటెత్త‌డంతో ర‌హ‌దారుల‌న్నీ న‌దుల‌ను త‌ల‌పించాయి. కొన్నిచోట్లు న‌డుముల లోతు నీళ్లు నిలువ‌డంతో వాహ‌నాల రాక‌పోక‌ల‌కు తీవ్ర ఇబ్బందులు ఏర్ప‌డ్డాయి. ప‌లు ప్రాంతాల్లో సెల్లార్‌ల‌లోకి వ‌ర‌ద నీరు చేరింది. భారీ వ‌ర్షం కురువ‌డంతో నాసిక్ మున్సిప‌ల్ అధికారులు రంగంలోకి దిగి న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టారు.  


logo