ఆదివారం 31 మే 2020
National - May 19, 2020 , 19:02:51

బెంగాల్‌ తీరంలో సముద్రం అల్లకల్లోలం.. బలమైన గాలులు, భారీ వర్షం.. వీడియో

బెంగాల్‌ తీరంలో సముద్రం అల్లకల్లోలం.. బలమైన గాలులు, భారీ వర్షం.. వీడియో

కోల్‌కతా: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పడీనం బలపడి వాయుగుండంగా, తర్వాత తుఫాన్‌గా, ఆ తర్వాత మహాతుఫాన్‌గా మారి ఉత్తర దిశగా వేగంగా కదులుతున్నది. అంఫాన్‌గా పేరు ఖరారైన ఈ తుఫాన్‌ బుధవారం ఒడిశా, పశ్చిబెంగాల్‌ మధ్యలో తీరాన్ని తాకుతుందని భారత వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే ప్రకటించారు. అయితే తుఫాన్‌ తీరాన్ని తాకడానికి ఒకరోజు ముందే పశ్చిమబెంగాల్‌ తీరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. సముద్రం అల్లకల్లోలంగా తయారైంది. బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. దట్టమైన మబ్బులు కమ్ముకుని వర్షం కురుస్తున్నది.


logo