శుక్రవారం 15 జనవరి 2021
National - Dec 24, 2020 , 15:10:44

నైట్ క‌ర్ఫ్యూ.. బెంగ‌ళూరులో భారీ బందోబ‌స్తు

నైట్ క‌ర్ఫ్యూ.. బెంగ‌ళూరులో భారీ బందోబ‌స్తు

బెంగ‌ళూరు : బ్రిట‌న్‌లో వెలు‌గు‌చూ‌సిన కొత్త రకం కరోనా వైరస్‌ పట్ల పలు రాష్ట్రాలు అప్ర‌మ‌త్త‌మ‌య్యాయి. ఈ క్రమంలో గురు‌వారం రాత్రి నుంచి జన‌వరి 1 వరకు రాత్రి కర్ఫ్యూ విధి‌స్తు‌న్నట్టు కర్ణా‌టక ప్రభుత్వం వెల్ల‌డిం‌చిన విష‌యం విదిత‌మే. ఈ నేప‌థ్యంలో బెంగ‌ళూరులో పోలీసులు భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. 

ఈ సంద‌ర్భంగా బెంగ‌ళూరు పోలీసు క‌మిష‌న‌ర్ క‌మ‌ల్ పంత్ మీడియాతో మాట్లాడుతూ.. జ‌న‌వ‌రి 2వ తేదీ వ‌ర‌కు రాత్రి 11 గంట‌ల నుంచి తెల్ల‌వారుజామున 5 గంట‌ల వ‌ర‌కు క‌ర్ఫ్యూ కొన‌సాగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. అన‌వ‌స‌రంగా రోడ్ల‌పైకి వ‌చ్చే వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. కేవ‌లం ప‌బ్లిక్ ట్రాన్స్‌పోర్ట్, నిత్యావ‌స‌ర వ‌స్తువుల‌ను తీసుకెళ్లే గూడ్స్ వెహిక‌ల్స్, ఎయిర్‌పోర్టు ట్యాక్సీల‌కు మాత్ర‌మే అనుమ‌తి ఉంటుంద‌న్నారు. మెడిక‌ల్ స్టోర్స్ మిన‌హాయించి మిగ‌తా దుకాణ స‌ముదాయాల‌ను త‌ప్ప‌నిస‌రిగా రాత్రి 11 గంట‌ల‌కు మూసేయాల‌ని ఆదేశించారు. ప్ర‌ధాన ర‌హ‌దారులు, ఫ్లై ఓవ‌ర్ల‌తో పాటు స‌మ‌స్యాత్మ‌క ప్రాంతాల్లో పోలీసులు పెట్రోలింగ్ నిర్వ‌హిస్తార‌ని పేర్కొన్నారు. నైట్ క‌ర్ఫ్యూ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘిస్తే చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు.   

రాత్రి స‌మ‌యాల్లో విధుల‌కు వెళ్లే ప్ర‌యివేటు ఉద్యోగులు త‌ప్ప‌నిస‌రిగా త‌మ కంపెనీ ఐడీ కార్డును ఉంచుకోవాల‌ని సూచించారు. లేని యెడ‌ల అనుమ‌తి ఇవ్వ‌బోమ‌ని తేల్చిచెప్పారు. దూర ప్ర‌యాణాలు చేసిన వారు త‌ప్ప‌నిస‌రిగా తాము ప్ర‌యాణించిన టికెట్‌ను భ‌ద్ర‌ప‌రుచుకోవాల‌ని, పోలీసులు అడిగిన వేళ దాన్ని చూపించాల‌న్నారు.  

రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఈ కర్ఫ్యూ కొన‌సా‌గు‌తుం‌దని పేర్కొంది. క్రిస్మస్‌, న్యూఇ‌యర్‌ వేడు‌కల్లో ప్రజ‌లె‌వ్వరూ సామూ‌హిక ప్రార్థ‌న‌లు/‌వే‌డు‌కలు జర‌ప‌రా‌దని గుజ‌రాత్‌ ప్రభుత్వం ఆదే‌శాలు జారీ చేసింది. మహా‌రా‌ష్ట్రలో రాత్రి కర్ఫ్యూ కొన‌సా‌గు‌తున్న నేప‌థ్యంలో ప్రజ‌లె‌వ్వరూ రాత్రి‌పూట బయ‌టకు రావొ‌ద్దని ముంబై పోలీ‌సులు విజ్ఞప్తి చేశారు. 

ఇవి కూడా చ‌ద‌వండి..

ఆ కొత్త ర‌కం క‌రోనా వైర‌స్ అలా బ‌య‌ట‌ప‌డింది!
ఇండియాతో చ‌ర్చ‌లు సాధ్యం కావు: పాకిస్థాన్‌
త్వ‌ర‌ప‌డండి.. కార్ల‌పై భారీ డిస్కౌంట్లు