శుక్రవారం 05 జూన్ 2020
National - May 10, 2020 , 12:42:35

ఢిల్లీలో ఈదురు గాలులు.. భారీగా ఎగిసిప‌డుతున్న‌ దుమ్ము

ఢిల్లీలో ఈదురు గాలులు.. భారీగా ఎగిసిప‌డుతున్న‌ దుమ్ము

న్యూఢిల్లీ: దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో వాతావ‌ర‌ణం ఒక్క‌సారిగా మారిపోయింది. శ‌నివారం వ‌ర‌కు భానుడి భ‌గ‌భ‌గ‌ల‌తో అల్లాడిన‌ ఢిల్లీలో ఆదివారం వాతావ‌ర‌ణం ఉన్న‌ట్టుండి చ‌ల్ల‌బ‌డింది. అయితే బ‌లంగా వీస్తున్న ఈదురు గాలులు న‌గ‌రాన్ని అత‌లాకుత‌లం చేస్తున్నాయి. భీక‌ర గాలుల ధాటికి భారీగా దుమ్ము, ధూళి ఎగ‌సి రోడ్ల  మీద, నివాసాల మీద ప‌డుతున్న‌ది. మండుటెండ‌ల కార‌ణంగా పొడారిపోయిన మ‌ట్టి.. వాన ప‌డ‌కుండా ఒట్టి గాలులు మాత్ర‌మే వీస్తుండ‌టంతో ద‌ట్టంగా ఎగ‌సి ప‌డుతున్న‌ది. వ‌సంత్ విహార్‌, గాజీపూర్ ఏరియాల్లో దుమ్ము మ‌రింత ఎక్కువ‌గా ఎగిసిప‌డుతున్న‌ది. 


logo