శనివారం 26 సెప్టెంబర్ 2020
National - Aug 09, 2020 , 19:27:06

హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న శ్రీరామ్ పోస్టల్ స్టాంపులు

హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న శ్రీరామ్ పోస్టల్ స్టాంపులు

లక్నో : అయోధ్యలోన రామాలయం భూమి పూజన్ రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విడుదల చేసిన శ్రీ రాముడి తపాలా బిళ్ళలకు డిమాండ్ పెరిగింది. రాముడి జీవితం ఆధారంగా తీసుకొచ్చిన పోస్టల్ స్టాంపులు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. వీటి డిమాండ్ భారత్ లోనే కాకుండా విదేశాల్లోనూ ఉండటం విశేషం. భావి తరాలకు చూపించేందుకు వీటిని కొనుగోలు చేసి దాచిపెట్టుకుంటున్నారు.

ప్రస్తుతం పోస్టల్ విభాగంలో 60 వేల స్టాంపులు అందుబాటులో ఉన్నాయి. నాలుగు రోజుల్లో అయోధ్య పరిశోధనా సంస్థ 5 వేల టికెట్లను కొనుగోలు చేసింది. ఇందుకోసం తపాలా శాఖకు రూ.12 లక్షలు చెల్లించింది. అదే సమయంలో లక్నో-అయోధ్య పోస్టాఫీస్ నుంచి 500 టిక్కెట్లు కొనుగోలు చేశారు. ఈ స్టాంప్‌కు సంబంధించి దేశవ్యాప్తంగా.. విదేశాల నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయని పోస్టల్ సర్వీసెస్ ప్రధాన కార్యాలయం లక్నో రీజియన్ డైరెక్టర్ కేకే యాదవ్ తెలిపారు. కార్పొరేట్ మై స్టాంప్ కింద తయారు చేసిన స్టాంపుల్లో ఇప్పటివరకు మొత్తం 5,500 అమ్ముడయ్యాయి. 5 వేల షీట్లు ముద్రించగా.. ఒక షీట్లో మొత్తం 12 స్టాంపులు ఉన్నాయి. ఒక స్టాంప్ ధర రూ.25. విశ్వాసానికి సంబంధించిన తపాలా స్టాంపుల కారణంగా దాని డిమాండ్ గణనీయంగా పెరిగింది. లక్నో-అయోధ్యతోపాటు దేశంలోని పలు ప్రాంతాల నుంచి మాత్రమే కాకుండా విదేశాల నుంచి స్టాంపులు కావాలని కోరుతున్నట్లు సమాచారం. 


logo