శనివారం 04 జూలై 2020
National - Jun 23, 2020 , 18:51:02

తమిళనాడులో భారీగా కరోనా కేసులు

తమిళనాడులో భారీగా కరోనా కేసులు

చెన్నై : తమిళనాడులో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. తాజాగా 24 గంటల్లో 2,516 రికార్డు కరోనా కేసులు నమోదు కావడంతో పాటు 1,227 మంది కోలుకొని డిశ్చార్జి అయినట్లు ఆరోగ్య శాఖ మంగళవారం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. కరోనా మరణాలు కూడా ఇక్కడ భారీగానే ఉన్నాయి. ఒక్కరోజే 39 మంది మృతి చెందగా అందులో 11 మంది ప్రైవేట్‌, 28 మంది ప్రభుత్వ దవాఖానలో మరణించినట్లు  అధికారులు తెలియజేశారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 64,603 కాగా, ఇప్పటివరకు 833 మంది మరణించారు. 


logo