గురువారం 13 ఆగస్టు 2020
National - Jul 26, 2020 , 19:06:23

కర్ణాటకను వణికిస్తున్న కరోనా

కర్ణాటకను వణికిస్తున్న కరోనా

బెంగళూరు : కరోనా వైరస్‌ కర్ణాటక రాష్ర్ట ప్రజలను వణికిస్తోంది. ప్రతి రోజు 5 వేల పైన కేసులు నమోదు అవుతుండడంతో భయాందోళనకు గురవుతున్నారు. వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో వైద్యులు, అధికారులు తలలు పట్టుకుంటున్నారు. కఠిన నిబంధనలు జారీ చేసినా ఫలితం లేకుండా పోతోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా చాప కింద నీరులా వ్యాపిస్తోంది. 

గడిచిన 24 గంటల్లో రాష్ర్టంలో 5,199 కేసులు నమోదు కాగా 82 మంది వైరస్‌ బారిన పడి మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 96,141కి చేరింది. ఇందులో 58,417 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు కరోనా వైరస్‌తో 1,878 మంది మృత్యువాత పడినట్లు వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం తెలిపింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo