శనివారం 15 ఆగస్టు 2020
National - Jul 31, 2020 , 18:02:02

ఏపీలో 24 గంటల్లో 10,376 కరోనా కేసులు

ఏపీలో 24 గంటల్లో 10,376 కరోనా కేసులు

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ స్వైర విహారం చేస్తోంది. ఎలాంటి లక్షణాలు లేకుండా వైరస్‌ వ్యాప్తి చెందుతుండడంతో వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. గత మూడు రోజులుగా ప్రతి రోజు 10వేల పైనే కేసులు నమోదవుతుండడంతో ఏపీ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గడిచిన 24 గంటల్లో 10,376 కేసులు నమోదు అయినట్లు శుక్రవారం రాష్ర్ట వైద్య ఆరోగ్య శాఖ తెలియజేసింది

దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,40,933కు చేరుకుంది. ఇందులో 75,720 మంది కరోనా వ్యాధి సోకి దవాఖానల్లో చికిత్స పొందుతుండగా 63,864 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. వ్యాధి బారిన పడి ఇప్పటివరకు 1,349 మంది మృతిచెందారు. అత్యధికంగా అనంతపురంలో 1,387 కేసులు నమోదు కాగా, అత్యల్పంగా కృష్ణా జిల్లాలో 313 కేసులు నమోదయ్యాయి. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo