మంగళవారం 04 ఆగస్టు 2020
National - Jul 30, 2020 , 23:19:38

అందమైన పాదాల కోసం ఇలా చేయండి...

అందమైన పాదాల కోసం ఇలా చేయండి...

హైదరాబాద్: అమ్మాయిలు అందంగా మారడం కోసం ఏ చిట్కాలనైనా వాడడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. చాలా మంది మహిళలు ముఖానికి పెట్టిన శ్రద్ధ పాదాలపై పెట్టరు. కనుక వాటిని అందంగా మలుచుకోవడానికి  ఈ చిట్కాలు పాటిస్తే సరి.  ఒక స్పూన్ శనగపిండిలో ఒక స్పూన్ తేనె, ఒక స్పూన్ నిమ్మరసం, చిటికెడు పసుపు వేసి పేస్ట్ గా తయారుచేయాలి. ఈ పేస్ట్ ని పాదాలకు రాసి అరగంట తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో మూడు సార్లు చేసుకుంటే మంచి ఫలితం కనపడుతుంది.

బేకింగ్ సోడాలో కొద్దిగా నీటిని పోసి పేస్ట్ గా తయారు చేయాలి. ఈ పేస్ట్ ని పాదాలకు రాసి ఆరిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. బేకింగ్ సోడా పాదాల మురికిని వదిలించటానికి చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. బొప్పాయి గుజ్జులో నాలుగు చుక్కల నిమ్మరసం కలిపి మర్దనా చేస్తే మడమలకున్న మురికి పోతుంది. క్రమంగా ఇలా చేస్తే మురికి తొలగడమే కాకుండా పగుళ్ళు కూడా దరి చేరవు.

ఆలివ్ ఆయిల్ లో దూది ముంచి ఆ దూదిని గుండ్రటి ఆకారంలో తిప్పుతూ పాదాలని ఒక పది నిమిషాలు మసాజ్ చేసి సాక్స్ వేసుకుని ఒక అరగంట ఉంచి తర్వాత వేడి నీతితో కడిగినా చాలు పదాలు మెరిసిపోతాయి. రాత్రి పడుకునే ముందు కాళ్ళు శుభ్రంగా కడిగి ఇంట్లో ఉండే వేసలైన్ ని పాదాలకి పట్టించి పడుకోవాలి. ఇలా చేస్తే రెండు మూడు రోజుల్లోనే మీ పాదాలలో వచ్చిన తేడాని మీరే గమనించవచ్చు. మజ్జిగలో కొంచెం పసుపు వేసి రెండు పాదాలకు రాసి ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం కనపడుతుంది. అయితే ఈ విధంగా వారంలో రెండు మూడు సార్లు చేస్తూ ఉండాలి.

రెండు స్పూన్ల ఫైనాపిల్ జ్యుస్ లో అరస్పూన్ తేనే కలిపి పాదాలకు రాసి 5 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేస్తే పాదాలకు బాగా రక్తప్రసరణ జరిగి పాదాలు ఆరోగ్యంగా అందంగా కనపడతాయి. నువ్వుల నూనెను గోరు వెచ్చగా వేడి చేసి రాత్రి పడుకునే ముందు రాసుకుంటే పాదాలు మృదువుగా తయారవుతాయి. రోజ్ వాటర్, గ్లిజరిన్ సమపాళ్ళలో తీసుకొని దానిలో దూది ముంచి దానిని పాదాలకు రాసి 15 నిమిషాలు ఆరనిచ్చి కడిగెయ్యాలి. ఇలా రెండు రోజులకి ఒకసారి నెల రోజులు చేస్తే చాలు పాదాలు మృదువుగా మారిపోతాయి.

 


logo