న్యూఢిల్లీ: సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్)లో గ్రూప్ బీ, సీ విభాగంలో ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఆఫ్లైన్ దరఖాస్తులు డిసెంబర్ చివరి వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 70 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో జూనియర్ ఫ్లైట్ ఇంజినీర్, ఎన్స్పెక్టర్ లేదా స్టోర్మ్యాన్, జూనియర్ ఎయిర్క్రాఫ్ట్ మెకానిక్, అసిస్టెంట్ ఎయిర్క్రాఫ్ట్ మెకానిక్, సీనియర్ ఎయిర్క్రాఫ్ట్ మెకానిక్, సీనియర్ రేడియో మెకానిక్ (ఇన్స్పెస్టర్), అసిస్టెంట్ ఎయిర్క్రాఫ్ట్ రేడియో మెకానిక్ పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టులు: 70
ఇందులో సీనియర్ ఎయిర్క్రాఫ్ట్ మెకానిక్ 12, సీనియర్ రేడియో మెకానిక్ 5, జూనియర్ ఎయిర్క్రాఫ్ట్ మెకానిక్ 4, అసిస్టెంట్ ఎయిర్క్రాఫ్ట్ మెకానిక్ 8, అసిస్టెంట్ ఎయిర్క్రాఫ్ట్ రేడియో మెకానిక్ 3, సీనియర్ ఫ్లైట్ గన్నర్ 1, జూనియర్ ఫ్లైట్ గన్నర్ 4, సీనియర్ ఫ్లైట్ ఇంజినీర్ 1, జూనియర్ ఫ్లైట్ ఇంజినీర్ 4, ఇన్స్పెక్టర్ లేదా స్టోర్మ్యాన్ 4, సబ్ ఇన్స్పెక్టర్ 4, కానిస్టేబుల్ 4 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: డిసెంబర్ 31, 2021
పూర్తివివరాలకువెబ్సైట్: bsf.nic.in
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..