సోమవారం 18 జనవరి 2021
National - Dec 26, 2020 , 18:31:41

రజనీకాంత్‌ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్‌ బులెటెన్‌ విడుదల

రజనీకాంత్‌ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్‌ బులెటెన్‌ విడుదల

హైదరాబాద్ : తమిళ సూపర్‌ స్టార్‌ అనారోగ్య పరిస్థితిపై శనివారం సాయంత్రం అపోలో ఆసుపత్రి  వైద్యులు మరోమారు హెల్త్‌ బులెటెన్‌ విడుదల చేశారు. రజనీకాంత్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు.  ఇప్పటివరకు నిర్వహించిన వైద్య పరీక్షల నివేదికలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అంశాలను గుర్తించలేదని పేర్కొన్నారు. మరికొన్ని వైద్య పరీక్షల నివేదికలు రావాల్సి ఉందని వెల్లడించారు.

వైద్య పరీక్షల నివేదికలు రాగానే అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి ఆదివారం ఆయనను డిశ్చార్జి చేస్తామని తెలిపారు. కాగా రక్తపోటులో హెచ్చుతగ్గుల కారణంగా శుక్రవారం ఉదయం చికిత్స నిమిత్తం  ఆయన జూబ్లిహిల్స్‌ అపోలో ఆసుపత్రిలో చేరారు. వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారు. రజనీకాంత్‌ వెంట ఆయన కూతురు ఉండి బాగోగులు చూస్తోంది. రజనీకాంత్‌ను పరామర్శించేందు వచ్చే ఎవరినీ ఆసుపత్రి వర్గాలు లోపలికి అనుమతి ఇవ్వడం లేదు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.