గురువారం 13 ఆగస్టు 2020
National - Aug 02, 2020 , 20:51:37

నువ్వులతో ఈ రోగాలు నయం అవుతాయి...

 నువ్వులతో ఈ రోగాలు నయం అవుతాయి...

హైదరాబాద్: నువ్వులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకోసమే 'పవర్ హౌజ్' అని పిలుస్తారు. నువ్వుల్లో ఐరన్, జింక్, కాల్షియం, థయామిన్, మినరల్స్‌తో పాటు విటమిన్ 'ఇ' కూడా సమృద్ధిగా పుష్కలంగా లభిస్తుంది. నువ్వుల విత్తనాలనుంచి తీసిన నూనెలో శక్తి వంతమైన పదార్థాలు అధిక రక్తపీడనాన్ని తగ్గిస్తుంది. రక్తంలో యాంటీ ఆక్సిడెంట్ స్థాయిలను, మధుమేహ వ్యాధి గ్రస్తులలో ప్లాస్మాలోని గ్లూకోజ్ స్థాయిలను పెంచుతుంది. నువ్వుల నూనె వాడటం వల్ల చాలా తక్కువగా గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. ఇందులోవుండే మినరల్స్ హృదయనాళాలను చురుకుగా పనిచేసేలా చేస్తోంది. దెబ్బలు తగిలినప్పుడు తొందరగా మానటంలో చాలా సహాయం చేస్తుంది.

నువ్వులు ఫైబర్‌ను కలిగి ఉంటాయి. వీటినే లిగ్నిన్స్ అంటారు. ఈ రకమైన ఫైబర్స్ శరీరాల్లో ఏర్పడే చెడు కొవ్వును పూర్తిగా తొలగిస్తుంది. నల్ల నువ్వులలో ఉండే ఫైటోస్టేరోసిస్ కొవ్వును తగ్గిస్తూ కేన్సర్ కణాలను వృద్ధి చెందకుండా చేస్తుంది. నల్ల నువ్వులు రోజు తినడం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు పదార్థాలను బయటకి పంపి మన శరీరాన్ని నూతన ఉత్తేజాన్ని అందిస్తుంది. ఈ నువ్వుల్లో ఉండే పోషకాల వల్ల వయసు పెరిగిన అందం మాత్రం తగ్గకుండా చేస్తుంది. నువ్వులల్లో ఉండే మూలాశక్తి వల్ల అల్ట్రావైలెట్ కిరణాల చర్మంపై పాడినప్పుడు ఏర్పడే నల్ల మచ్చలను తొలగిస్తుంది. అలాగే చర్మ సంబంధిత క్యాన్సర్‌ని నల్ల నువ్వులు తగ్గిస్తాయి.


logo