సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 28, 2020 , 22:41:08

ఆరోగ్యానికి మేలు చేసే సజ్జలు

  ఆరోగ్యానికి మేలు చేసే సజ్జలు

హైదరాబాద్;  తీసుకునే ఆహారంలో సరైన పోషకాలు లేకపోవడంతోపాటు , వ్యాయామం చేయకపోవడం. ఇలాంటి సమస్యలను తగ్గించుకోవాలంటే ప్రకృతి ప్రసాదించిన సహజసిద్ధమైన సజ్జలు కీలక పాత్ర వహిస్తాయి. సజ్జలు ఆరోగ్యానికి చాలా మంచిది. వాటిలో చాలా పోషకాలు ఉన్నాయి. సజ్జలు తింటే తలనొప్పి మటుమాయం అవుతుంది. వీటిలో మెగ్నీషియం, రిబోఫ్లావిన్ ఎక్కువగా ఉండటం వల్ల తలనొప్పిని తగ్గించడానికి సహాయ పడుతుంది. రక్తహీనతతో బాధపడేవారు సజ్జలతో తయారుచేసిన పదార్థాలు తినడం చాలా మంచిది. సజ్జలలో విటమిన్లు, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి.

ఇందులో ప్రోటీన్స్ పీచు పదార్థం పుష్కలంగా ఉండటం వల్ల ఆహారం నిదానంగా జీర్ణమై చక్కెర నిల్వలు నెమ్మదిగా విడుదలవుతాయి. అంతేకాకుండా కండరాలకు ఎక్కువ శక్తిని ఇస్తాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఎముకలను దృఢంగా ఉంచుతాయి. జీర్ణకోశాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. షుగర్ వ్యాధితో బాదపడేవారికి సజ్జలు చక్కని ఆహారం. వీటిని ఆహారంలో చేర్చుకోవడం వలన షుగర్ లెవల్స్‌ కంట్రోల్‌లో ఉంచుతుంది. స్థూలకాయ సమస్య ఉన్నవారు ప్రతిరోజు మొలకెత్తిన సజ్జలు తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

పిల్లలు ఉల్లాసంగా, ఆరోగ్యంగా, దృఢంగా పెరగడానికి సజ్జలు దోహదపడతాయి. అంతేకాకుండా పిల్లల్లో జ్ఞాపక శక్తిని పెంచుతాయి. ప్రతిరోజు ఉదయాన్నే పిల్లలకు మొలకెత్తిన సజ్జలను పెట్టడం ద్వారా ఎత్తు పెరుగుతారు. అంతేకాకుండా ఇవి శరీరాన్ని చలువపరుస్తాయి. సజ్జ పిండిలో బెల్లం కలిపి రొట్టెలా చేసుకుని తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వుని తగ్గించి రక్తంలోని కొలస్ట్రాల్ ను తగ్గిస్తాయి.


logo