ఆదివారం 25 అక్టోబర్ 2020
National - Sep 24, 2020 , 21:46:36

ఇప్ప పువ్వులో ఔషధ గుణాలెన్నో...!

 ఇప్ప పువ్వులో ఔషధ గుణాలెన్నో...!

హైదరాబాద్ : ఇప్ప చెట్టు సపోటేసి కుటుంబానికి చెందిన అడవి చెట్టు. భారతదేశంలోని గిరిజనులు దీనిని పవిత్రంగా భావిస్తారు. ఇప్ప పువ్వుల నుంచి తీసిన నూనె వంట కోసం వాడతారు. ఇందులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఇప్పనూనెను చర్మరక్షణ తైలంగా. కీళ్లనొప్పులకు మర్ధననూనెగా వినియోగిస్తుంటారు. శుద్ధిచేసిన నూనెను వనస్పతి, సబ్బులు, కొవ్వొత్తులు, ఫ్యాటి ఆమ్లాలు ఉత్పత్తిలో ఉపయోగిస్తారు. గిరిజనులు ఇప్పపూలను ఆహారంగా కూడా తీసుకుంటారు. ఇప్పచెట్టు కలపను ఇంటి తలుపులు, గుమ్మాలు, కిటికిలు, ఎడ్లబళ్ల చక్రాల తయారిలో వాడతారు. అయితే ఇది ఎక్కువగా ఉష్ణమండల అడవులు, బయలు, మైదాన భాగల్లో పెరుగుతుంది. కానీ గ్రామాల్లో కూడా ఇప్పచెట్లు కన్పిస్తాయి.

- గొంతు వాపుకు : గొంతువాపుతో ఆహారాన్ని మింగలేని వారు ఇప్పపువ్వు మూడు గ్రాములు మోతాదు తీసుకొని కొద్దికొద్దిగా నమిలి, నీళ్లతో మింగుతూ ఉండాలి. ఇలా చేస్తూ ఉంటే గొంతు వాపు తగ్గి తినగలుగుతారు.

ఎక్కిళ్ళకు : ఇప్పపూలను దంచి తీసిన రసానికి తేనెను కలిపి, 4 చుక్కలు ముక్కులో వేసి పీలిస్తే ఎక్కిళ్ళు ఆగిపోతాయి.

-అతిదాహానికి : ఇప్పపువ్వు బుగ్గన పెట్టుకుని చప్పరించి, రసం మింగుతూ ఉంటే అతిదాహం తగ్గిపోతుంది.

-పెదవులకు : ఇప్ప చెక్కను శుభ్రంగా కడిగి, ముక్కలు చేసి, ఆరబెట్టి దంచుకోవాలి, దంచిన ఆ పొడిని పలుచని నూలు బట్టలో వేసి వడగట్టుకోవాలి. అప్పుడు వచ్చిన సన్నని ఇప్పచెక్క పొడికి కొంచం నెయ్యి కలిపి పెదవులపైన లేపనం వేస్తూ ఉంటే.. పెదవుల పగుళ్లు, పుండ్లు, నల్లధనం తగ్గిపోయి మృదువుగా మారతాయి.

- రక్త పైత్యానికి : ఇప్పచెట్టు బెరడు 10 గ్రాములు కడిగి, నలగ్గొట్టి ఒక గ్లాసు నీటిలో వేసి మరిగించాలి. ఈ కషాయాన్ని చల్లార్చి రెండు లేదా మూడు పూటలా ఒక కప్పు తాగుతూ ఉంటే శరీరంలోని ఏ భాగంలో నుండి రక్తం పోతున్నా ఆగిపోతుంది. ఇంకా ఇప్పచెట్టుతో ఎన్నో ప్రయోజలు ఉన్నాయి. 

-గిరిజనులు జరుపుకునే సంప్రదాయ వేడుకలు, సంబరాలు, పెళ్ళి సమయంలో ఇప్పపూల నుండి తయారు చేసిన సారాను త్రాగడం ఆచారంగా పాటిస్తారు. ఇప్పపూలను, ఊటబెల్లాన్ని చేర్చి, పులియబెట్టి సారాను తయారు చేస్తారు. ఇది తీయగా ఉంటుంది. మనకు బయట దొరికే బ్రాందీ, విస్కీలకన్నా కోటిరెట్లు మెరుగ్గా ఉంటుంది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.



logo